Kishan Reddy: గత ఎన్నికల్లో కొందరు బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు చేశారు
Kishan Reddy: మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాయి
Kishan Reddy: గత ఎన్నికల్లో కొందరు బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు చేశారు
Kishan Reddy: గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, అనేక కుట్రలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. సోమాజిగూడలో బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం హాజరై కిషన్‌రెడ్డి ప్రసంగించారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే కాంగ్రెస్ ఉద్దేశమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.