Srisailam: శ్రీశైలం ఆలయంలో అందుబాటులోకి స్మార్ట్ సేవలు..

Srisailam: గూగుల్ ప్లే స్టోర్లో శ్రీశైల దేవస్థానం అని సెర్చ్ చేయాలి

Update: 2023-08-07 12:20 GMT

Srisailam: శ్రీశైలం ఆలయంలో అందుబాటులోకి స్మార్ట్ సేవలు.. 

Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం స్మార్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించడానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకుని మల్లన్న దర్శనం చేసుకుంటారు. అయితే వచ్చిన భక్తులు వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు విషయమై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది దళారీలు బారినపడి మోసపోతున్నారు. శ్రీశైలం దేవస్థానం కొత్తగా ఆన్లైన్ ద్వారానే కాకుండా మొబైల్ యాప్ ద్వారా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది.

శ్రీశైలం వచ్చే భక్తులు ఇటువంటి సేవలను బుక్ చేసుకోవాలన్న www.srisailadevasthanam.org అనే వెబ్సైట్ ద్వారా చేసుకునేవారు. అయితే భక్తుల సౌకర్యార్థం మొదటిసారిగా డిఓటి కనెక్ట్ అనే యాప్ ను 9&9 అనే సంస్థ వారు తయారు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభించారు. భక్తులు వారికి నచ్చిన సేవలు, దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాల వివరాలు ఇతర వివరాలు నోటిఫికేషన్ రూపంలో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

భక్తులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా స్వామి అమ్మవార్ల పూర్తి సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీశైల దేవస్థానంలో నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు ఉత్సవాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు శ్రీశైల టీవీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ముందుగా లాగిన్ చేసుకొని వారికి కావలసిన ఆధ్యాత్మిక సమాచారాన్ని పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో శ్రీశైల దేవస్థానం అని అన్వేషిస్తే భక్తులకు ఈ యాప్ అందుబాటులోకి వస్తోంది. ఈ యాప్ ను భక్తులు డౌన్లోడ్ చేసుకొని వారికి ఏ రకమైన సేవలు కావాలన్నా పొందవచ్చు.

Tags:    

Similar News