Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం... ఇంటర్ బాలిక దారుణ హత్య
నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక బాలిక దారుణ హత్యకు గురైంది.
Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం... ఇంటర్ బాలిక దారుణ హత్య
నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక దారుణ హత్యకు గురైంది. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారెడ్డి గూడెంకు చెందిన బాలిక కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నల్గొండ మండలం గుట్ట కింది అన్నారం గ్రామానికి చెందిన యువకునితో బాలిక ప్రేమలో పడ్డట్టు సమాచారం. దీంతో యువకుడు తన మిత్రుడైన ఓ ఆటో డ్రైవర్ రూమ్‌లోకి బాలికను తీసుకెళ్లాడని, అనంతరం ఇరువురి మధ్య గొడవ జరగిందని..ఆ విద్యార్థినిని చంపేసి డైట్ కాలేజీ దగ్గర మృతదేహాన్ని పడేశారని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాలికపై లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.