మేకలకు మాస్క్ లు... కరోనా రాకుండా జాగ్రత్తలు

కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ సుమారుగా 209 దేశాలకు పాకింది. దీంతో ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది.

Update: 2020-04-08 05:34 GMT
Masks For Goats
కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ సుమారుగా 209 దేశాలకు పాకింది. దీంతో ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 75శాతానికి మంది

ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు లాక్ డౌన్ విధించడంతో ఇండ్ల పరిమితం అయ్యారు. అంతే కాక అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటికి వెల్లలనుకుంటే ప్రతి ఒక్కరు శానిటైజర్లు, మాస్కులు ధరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తున్నారు. కాగా ఈ మధ్య కాలంలో అమెరికాలోని ఓ జూలో పులికి కరోనా సోకిందనే వార్త రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మనుషులకు మాత్రమే కాకుండా పశువులకు, పక్షులకు ఈ వైరస్ సోకితే పరిస్థితి ఇంకా భయంకరంగా మారుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన పెంపుడ మేకలకు మాస్కులు కట్టాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో పులికి కరోనా వైరస్ రావడంతో ఎక్కడ తన మేకలకు వస్తుందో అని ఇతను ముందు జాగ్రత్తగా మాస్కులు కట్టి జాగ్రత్త పడుతున్నాడు. పూర్తి వివరాల్లోకెళితే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు కొంత కాలంగా మేకలను పెంచుకుంటున్నారు. వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎక్కడ తన మేకలను కరోనా వస్తుందో అని మేకల మూతికి మాస్కులు కట్టి మేతకు తీసుకెల్లాడు.

ఇక ఈ విషయాన్ని గమనించి వారంతా ఆ మేకలను విచిత్రంగా చూడడం మొదలు పెట్టారు. అసుల ఆ మాస్కులు మూగజీవాలకు కరోనా వ్యాపించకుండా ఎంత మేరకు ఆపుతాయో తెలియదు గానీ.. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో న్యూయార్క్ లో పులికి కరోనా వచ్చిందన్న వార్తలు విన్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేసారు. వేసవి వెల్లేంతవరకు వన్యప్రాణులకు ఎలాంటి నీటి కొరత ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాపించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 


Tags:    

Similar News