Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం.. తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2025-12-09 06:13 GMT

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం.. తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ ఓ అంగతకుడి నుంచి మెయిల్ వచ్చినట్టు సమాచారం. బాంబు పేలకూడదంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ మెయిల్‌లో గుర్తుతెలియని వ్యక్తి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. బాంబు బెదిరింపు ఘటనపై స్పందించిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. ఇదంతా అసత్య ప్రచారం అంటూ కొట్టిపారేశారు. అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు ఉందన్న వార్తను ఫాల్స్‌ న్యూస్‌గా తేల్చారు. సోషల్‌ మీడియాలో కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారని, ఇలాంటి పోస్టులను ఎవరూ నమ్మొద్దని తెలిపారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.

Tags:    

Similar News