Seethakka: రామప్పదేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు

Seethakka: ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్న సీతక్క

Update: 2023-12-18 06:47 GMT

Seethakka: రామప్పదేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు

Seethakka: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప రామలింగేశ్వరస్వామిని మంత్రి సీతక్క సోమవారం కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి పట్టువస్త్రాలను మంత్రికి అందజేసి ఆశీర్వదించారు..ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కృషిచేస్తానన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న టూరిజం భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించి మ్యాప్ ను పరిశీలించారు. అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు.

Tags:    

Similar News