Cabinet Expansion: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టేనా..?

Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? మిగిలిన ఆ ఆరు స్థానాల్లో ఎవరికి చోటు దక్కబోతోంది.

Update: 2023-12-22 15:30 GMT

Cabinet Expansion: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టేనా..?

Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? మిగిలిన ఆ ఆరు స్థానాల్లో ఎవరికి చోటు దక్కబోతోంది. ఇటీవలె ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏం నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్‌ ఏం సూచించింది. ఎవరు పేర్లు సూచించింది. పరిపాలనలో స్పీడ్‌ పెంచిన రేవంత్ ఇంకా పూర్తిస్థాయిలో కేబినెట్ విస్తరణ చేపట్టకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనుడటంతో ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాతే మిగిలిన మంత్రివర్గ స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సీఎం రేవంత్‌రెడ్డికి, టీకాంగ్రెస్‌ సర్కార్‌కు లోక్‌సభ ఎన్నికల రూపంలో కొత్త సవాల్ ఎదురుకాబోతోంది. అంసెబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని చూస్తోంది. రాష్ట్రంలో ఉన్న 17లోక్‌సభ స్థానాలకు గాను.. మెజార్టీ సెగ్మెంట్లను గెలుచుకోవాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోతే..అప్పుడే ప్రభుత్వమే వ్యతిరేకత మొదలైందని విపక్షాలు ఎదురుదాడి చేసే ఛాన్స్ ఉంటుంది. కనుక వాటికి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు రేవంత్. లోక్‌సభ ఎన్నికల ముందు కేబినెట్ విస్తరణ చేపడితే పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు, అలకలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఉంటుంది. కాబట్టి అనవసరంగా మంత్రివర్గ విస్తరణతో పార్టీకి నష‌్టం కలిగేగా చేయకూడదని రేవంత్ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News