సికింద్రాబాద్‌లో దారుణం.. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

సికింద్రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని లాడ్జిలో ఓ మైనర్ బాలికపై ఆరుగురు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

Update: 2025-12-11 07:00 GMT

సికింద్రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని లాడ్జిలో ఓ మైనర్ బాలికపై ఆరుగురు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సంగారెడ్డికి చెందిన 13 ఏళ్ల బాలిక ఈ నెల 4న కనిపించకుండా పోయింది. సికింద్రాబాద్‌లో ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై తిరుగుతుండగా కొందరు యువకులు బాలికను ఇంటికి తీసుకెళ్తామంటూ లాడ్జ్‌కు తీసుకెళ్లారు. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బంధించి బాలికపై గ్యాంగ్ రేప్‌‌కు పాల్పడ్డారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలికను గుర్తించిన పోలీసులు ఇద్దరు మైనర్లు, నలుగురు యువకులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించి మైనర్లను జువైనల్ హోంకు పంపించారు.

Tags:    

Similar News