'భవాని''ని దత్తతు తీసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Update: 2019-07-13 09:40 GMT

మనసు కలచివేసే దుర్గాభవాని గాథ ఎంతో మంది హృదయాలను కదిలించింది. కన్నీరుపెట్టించింది. మానవీయ కోణంలో హెచ్‌ఎంటీవీ ప్రసారం చేసిన కథనం బంగారు చిట్టితల్లికి ఓ కుటుంబాన్ని అందించింది. జననాయకుడిగా పేరుతెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జాగ్గారెడ్డి చిట్టికూతురుగా మారిపోయింది. జగ్గారెడ్డి ప్రకటనతో పసిపాప దుర్గాభవాని కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. తన ధీనగాధ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబాన్ని కదిలిచింది. చిన్నవయసులోనే భరించలేని బరువు మోస్తోన్న చిన్నారికి అండగా నిలిచాడు. స్వయంగా దుర్గాభవాని దగ్గరకు కుటుంబసమేతంగా వచ్చారు. అవ్వ కోసం అష్టకష్టాలుపడుతున్న చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. తన రెండో కూతురు అంటూ జగ్గారెడ్డి గారాలు చేశారు.

హెచ్‌ఎంటీవీ ప్రసారం చేసిన పాపం పసిపాప కధనానికి చలించిన ఆయన వెంటనే గ్రామానికి వెళ్లాడు. ఇంటితో పాటు కదలలేని అవ్వకు ఆపరేషన్‌ చేయిస్తానని అప్యాయంగా చల్లని కబురు చెప్పారు. మనవరాలిని చదివడంతో పాటు ఇల్లుకట్టిస్తానని హామి ఇచ్చారు. దీంతో జననాయకుడిగా మరోసారి జగ్గారెడ్డి నిలిచిపోయారు. జగ్గారెడ్డి రాకతో ఒక్కసారిగా కాలనీలో పండగ వాతావరణం నెలకొంది. అవ్వకు ఆపరేపన్‌ చేయడంతో పాటు పాప బాధ్యతను తీసుకుంటున్నట్లు జనం మధ్యే ప్రకటించడంతో అక్కడున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. దిక్కులేని భవానిని దేవుడిలా ఆదుకున్నాడని అక్కడి వారు కొనియాడారు.

మరోవైపు నాకో చిట్టి చెల్లి దొరికిందని మురిసిపోయింది జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి. చాలా యాక్టివ్‌గా ఉందని తను ఎంత వరకు చదివితే అంతవరకు చదిస్తామని చెప్పింది. సాక్షాత్తు దుర్గా భవాని అమ్మవారే తమను పాప దగ్గరుతీసుకువచ్చిందన్నారు జగ్గారెడ్డి భార్య నిర్మల. అమ్మవారి పేరు పెట్టుకున్న దుర్గాకు అండగా ఉంటామన్నారు. పాప దుర్భర స్థితి చూసి చాలా బాధపడమని ఇప్పటి నుంచి చిన్నారికి ఏ కష్టం లేకుండా చూసుకుంటామని చెప్పారు. 

Full View

Tags:    

Similar News