TSRTC Strike :కాసేపట్లో టీఎన్జీవో నేతలను కలవనున్నఆర్టీసీ జేఏసీ

-ఉద్యమానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేయనున్న యూనియన్లు -సాయంత్రం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్న ఆర్టీసీ జేఏసీ -సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కోదండరామ్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం

Update: 2019-10-10 09:28 GMT

ఆర్టీసీ జేఏసీ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. బుధవారం అఖిలపక్షంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన యూనియన్లు ఇవాళ తెలంగాణ నాన్ గెజిటెడ్‌ ఉద్యోగ సంఘాలను కలిసేందుకు సిద్ధమయ్యాయి. తమ పోరాటానికి.. సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరనున్నాయి. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నాయకులు.. టీ ఎన్జీవో ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే ఈ సాయంత్రం తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించేందుకు ఆర్టీసీ జేఏసీ ప్రణాళికలు రచించింది. ఈ నెల 19 న తెలంగాణ బంద్ పై కూడా నిర్ణయం ప్రకటించబోతున్నారు. అలాగే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జేఏసీ ప్రతినిధులు, అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత.. ఆర్టీసీ తమ తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు.  

Tags:    

Similar News