TSRTC Strike: 10 రోజుల్లోగా సమస్య తేల్చాలి... లేదంటే రాష్ట్ర బంద్

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ డెడ్‌లైన్‌..? 10 రోజుల్లోగా సమస్య తేల్చాలని అల్టిమేటం ఈ నెల 19 న తెలంగాణ బంద్‌..? గురువారం మరోసారి అఖిలపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ చర్చలు

Update: 2019-10-09 11:36 GMT

ఆర్టీసీ జేఏసీ తెలంగాణ సర్కారుకు డెడ్‌లైన్ విధించింది. గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు బుధవారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యపై 10 రోజుల్లోగా పరిష్కారం చూపాలని అల్టిమేటం జారీ చేసింది. లేకపోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని ప్రకటించింది. ఈ నెల 19 న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చే యోచనలో ఆర్టీసీ జేఏసీ ఉంది. అయితే గురువారం మరోసారి అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News