BRS: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

BRS: ఆర్ఎస్పీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్

Update: 2024-03-18 16:03 GMT

BRS: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

BRS: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో ఆర్ఎస్పీ కారెక్కారు. ఈ సంద‌ర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఆర్ఎస్పీతో పాటు బీఎస్పీ రాష్ట్ర నాయ‌కులు, జిల్లా నాయ‌కులు, మ‌ద్ద‌తుదారులు, అభిమానులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. పార్టీలో చేరికకు ముందు ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేశారని... అయితే తనకు అంతకంటే పెద్ద పని ఉందని చెప్పానన్నారు.

Tags:    

Similar News