Yadadri: యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం
Yadadri: ఆటోను ఢీకొట్టిన బస్సు
Yadadri: యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం
Yadadri: యాదాద్రి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులో శ్వేతా తెలుగు ఫుడ్స్ బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలుష్య రహిత పరిశ్రమల పార్క్‌లో పచ్చళ్ళను తయారుచేసే చిన్న పరిశ్రమను పెట్టారు. ఈ పరిశ్రమలో పని చేసేందుకు సమీప గ్రామమైన దేవాలమ్మ నాగారం నుంచి మహిళా కార్మికులతో వస్తున్న ఆటోను అదే కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది.
మూల మలుపు వద్ద ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఆటో లో వారందరికి తీవ్ర గాయాలవ్వాడంతో హైదరాబాద్ లోని ఆరంజ్ హాస్పిటల్ కి తరలించారు. వారిలో నాగలక్ష్మి, అనసూయ, ధనలక్ష్మి, శిరీష లు మృతి చెందాగా మరో ముగ్గురు మహిళలు డ్రైవర్ చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్పు చేస్తున్నరు. బంధువుల అర్దనాదాలతో హాస్పిటల్ ప్రాంగణం మారుమొగుతుంది.