నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

Nandyala: నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

Update: 2024-03-06 03:14 GMT

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

Nandyala: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డలో సమీపంలోని నల్లగట్ల వద్ద కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు గుర్తించారు. కారు తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News