Hyderabad: రోడ్డు ప్రమాదంలో సీఐ మృతి.. ఎస్సైకి తీవ్రగాయాలు

Hyderabad: రాంగ్‌రూట్‌లో బైక్‌ను ఢీకొట్టిన కారు

Update: 2024-02-14 07:54 GMT

Hyderabad: రోడ్డు ప్రమాదంలో సీఐ మృతి.. ఎస్సైకి తీవ్రగాయాలు

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో యూటర్న్ కోసం వెళ్తున్న ఎక్సైజ్ ఎస్సై కారు, ఎదురుగా వస్తోన్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చార్మినార్ ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని నారాయణగూడ ఎక్సైజ్ ఎస్సై మొహినుద్దీన్‌గా గుర్తించారు.

నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతి చెందిన సీఐ సాదిక్ అలీ, కారు డ్రైవ్ చేసిన ఎస్ఐ మొహినుద్దీన్ ఇద్దరు మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై క్వార్టర్స్‌కు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News