హయత్‌నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి మహిళలను ఢీ కొట్టిన ఇండికా కార్
* ప్రమాదానికి గురైన ఇద్దరు మహిళా జర్నలిస్టులు.. ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
హయత్‌నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం
Fatal Accident: హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఉదయం 5 గంటల ప్రాంతంలో డ్యూటీకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఎల్‌బీనగర్ నుండి హయత్‌నగర్ వైపు వేగంగా వచ్చిన ఇండికా కార్ అదుపుతప్పి ఢీ కొట్టడంతో మహిళా జర్నలిస్టు మృతి చెందగా మరో మహిళా జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా గోప్యంగా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.