Ration: రెచ్చిపోతున్న రేషన్ డీలర్లు.. బియ్యానికి బదులుగా డబ్బులు. ఎక్కడో తెలుసా.?
Ration: రేషన్ షాపులలో అందించాల్సిన బియ్యం పెద్దఎత్తున తప్పుదారి పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం ఓ బహిరంగ రహస్యంగా మారింది. వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం మూడు నెలల సరుకులను ఒకేసారి పంపిణీ చేయడాన్ని కొందరు డీలర్లు అక్రమార్జనకు అడ్డాగా మార్చుకున్నారు.

బియ్యం బదులుగా డబ్బు...
కొంతమంది డీలర్లు నేరుగా కార్డుదారులకు "బియ్యం వద్దు, డబ్బులు తీసుకోండి" అనే పద్ధతిని అమలు చేస్తున్నారు. కేజీకి రూ.14 చొప్పున ఇచ్చేస్తున్నారు. ఉదయాన్నే రేషన్ స్లిపులు ఇచ్చి, సాయంత్రానికి నగదు చెల్లిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని మళ్లీ బ్లాక్ మార్కెట్‌కి లేదా ఇతర మార్కెట్లకు తరలిస్తున్నారు.
అధికారులు హెచ్చరిస్తున్నా... ఫలితం శూన్యం
రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హెచ్చరిస్తున్నా, వాటి ప్రభావం లేకపోవడం గమనార్హం. ప్రతిరోజూ వందల క్వింటాళ్ల బియ్యం రహస్య మార్గాల్లో తరలింపవుతుండగా, పలు ప్రాంతాల్లో అధికారులు కనుగొనలేని స్థాయిలో ఈ అక్రమ దందా కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లాలో ఈ స్కామ్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు డీలర్లు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన బియ్యాన్ని బియ్యం ముఠాలకు విక్రయిస్తూ లాభాల పర్వాన్ని నడుపుతున్నారు. అర్హులైన ప్రజలకు రావాల్సిన ఆహారధాన్యం మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిపోతోంది.
రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి మార్కెట్‌లో అమ్మకాలు
అక్రమంగా సేకరించిన బియ్యాన్ని కొందరు రీసైకిల్ చేసి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ తరహా దందాలు పేద ప్రజలకు కేటాయించిన సంక్షేమ పథకాల పట్ల అవమానం కలిగించే విధంగా ఉన్నాయి. ఒకవైపు అధికారులు డీలర్ల రేషన్ లైసెన్సులు రద్దు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా, వాటిని అమలు చేయడంలో తీవ్ర లోపాలు ఉన్నాయి. ప్రాథమిక విచారణలపై మాత్రమే అటకెక్కించడం వల్ల డీలర్లు ధైర్యంగా అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.