ఆ జీవో ప్రగతి భవన్ లో సిద్ధం చేసిందే.. కేసీఆర్ జగన్ ఒక్కటే : రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2020-05-13 09:28 GMT

కృష్ణ జలాల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హీట్ రాజేసింది. తాజాగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 203ను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హైదరాబాద్ లో గాంధీ భవన్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. గతంలో పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుతామంటే ఆనాడు పీజేఆర్, మర్రిశశీధర్ రెడ్డి వ్యతిరేకించారని గుర్తు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి.

కేసీఆర్ ,జగన్ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆగస్ట్ 12న నగరి మీదుగా కేసీఆర్ కాంచీపురం వెళ్లే దారిలో వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో భోజనం చేసినప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గుర్తుకు రాలేదా అని నిలదీశారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ రోజా ఇంట్లో రాయలసీమ ను సస్యశ్యామలం చేస్తామని చెప్పలేదా అని నిలదీశారు. నల్లగొండ ,ఖమ్మం ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులకు కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. డిసెంబర్ లో ఏపీ క్యాబినెట్ ఆమోదించింది.. మే 5న జీవో వచ్చిందని, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రగతి భవన్ లో సిద్ధం చేసిందే అని ఆరోపించారు. జగన్ ,కేసీఆర్ ను విడదీసి చూడలేము పాలు ,నీళ్ల లాగ వాల్లు కలసి పోయారన్నారు.

Tags:    

Similar News