Kalyana Lakshmi: అమ్మాయిల తల్లిదండ్రులకు రేవంత్ సర్కార్ తీపికబుదరు..వారి అకౌంట్లోకి లక్ష రూపాయలు జమ

Kalyana Lakshmi: అమ్మాయిల తల్లిదండ్రులకు రేవంత్ సర్కార్ తీపికబుదరు..వారి అకౌంట్లోకి లక్ష రూపాయలు జమ

Update: 2024-08-23 05:23 GMT

Kalyana Lakshmi: అమ్మాయిల తల్లిదండ్రులకు రేవంత్ సర్కార్ తీపికబుదరు..వారి అకౌంట్లోకి లక్ష రూపాయలు జమ

Kalyana Lakshmi: ఆడపిల్ల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతుంటారో తెలిసిందే. అలాంటి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించే కల్యాణ లక్ష్మీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది.

ఈ పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లికి 1,00116 రూపాయలను ప్రభుత్వం వారికి అందిస్తోంది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో ఆడబిడ్డలకు శుభవార్త చెప్పింది. కల్యాణ లక్ష్మీకి నిధులు కేటాయించింది.

ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ నిధులను విడుదల చేసింది. దీంతో కొన్ని నెలలుగా పెండింగ్ లోనే ఉన్న కల్యాణ లక్ష్మీ లబ్దిదారుల దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించే ఛాన్స్ వచ్చింది. కల్యాణలక్ష్మీ స్కీమ్ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 1225.43కోట్లు విడుదల చేసింది.

ఈమధ్యే ప్రకటించిన బడ్జెట్ లో ఈ స్కీంకు ప్రభుత్వం రూ. 2175 కోట్లను కేటాయించింది. అందులో నుంచి 24038కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు నిధులు విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 

Tags:    

Similar News