Revanth Reddy: ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్
Revanth Reddy: బడి, గుడి, నీళ్ళు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యమే
Revanth Reddy: ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్
Revanth Reddy: ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇండ్లు వచ్చాయి, భూ పంపిణీ చేశామన్నారు. బడి, గుడి, నీళ్ళు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు రేవంత్ రెడ్డి. దొరల రాజ్యం కావాలా, ఇందిరమ్మ రాజ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాని పరకాల కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దొర ఏందిరో' అని పిడికిలి ఎత్తింది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు. ఎస్సీ, ఎస్టీలు పదవులు అనుభవించేలా చేసింది ఇందిరమ్మ రాజ్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యమే అన్నారు రేవంత్. దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలన్నారు.