Revanth Reddy: అధికారం శాశ్వతం అని కేసీఆర్ కలలు కన్నారు
Revanth Reddy: అదే డిసెంబర్ 3న దొరల తెలంగాణ అంతమవుతుంది
Revanth Reddy: అధికారం శాశ్వతం అని కేసీఆర్ కలలు కన్నారు
Revanth Reddy: కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోనున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. అధికారం శాశ్వతం అని కేసీఆర్ కలలు కన్నారని, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనదన్నారు. తెలంగాణ ప్రజల తరపున శ్రీకాంతాచారికి నివాళులు తెలిపిన రేవంత్‌రెడ్డి...శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతో తెలంగాణ ఉద్యమం ఆకాశమంత ఎత్తుకు ఎదిగారని గుర్తు చేశారు. శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదీకి లింక్ ఉందని.. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారన్నారు రేవంత్. అదే డిసెంబర్ 3న దొరల తెలంగాణ అంతమవుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.