Revanth Reddy: కేసీఆర్ దీక్ష చేశారని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వలేదు
Revanth Reddy: రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు బలితీసుకుంటుంటే.. అది చూడలేక సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు
Revanth Reddy: కేసీఆర్ దీక్ష చేశారని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వలేదు
Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. పేద ప్రజల ప్రతీకగా ఉండాల్సిన తెలంగాణను రాచరిక తెలంగాణగా కేసీఆర్ మార్చారని తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ముఖ్యమంత్రులు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేవారని, ఇప్పుడు ప్రజా దర్బార్ అనేదే లేదన్నారు. ప్రతిపక్ష నాయకులకు సచివాలయంలోకి అనుమతి కూడా లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. ఉద్యమంలో TG అని రాసుకుంటే.. కేసీఆర్ వచ్చాక టీఆర్‌ఎస్ కనిపించేలా TSగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు బలితీసుకుంటుంటే అది చూడలేక సోనియా గాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, కేసీఆర్ దీక్ష చేశారని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వలేదని చురకలు అంటించారు రేవంత్‌రెడ్డి.