RBI: రూ.10 నాణెం చెల్లుబాటుపై క్లారిటీ

హైదరాబాద్ నగరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'ఫైనాన్షియల్ లిటరసీ వీక్' నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Update: 2020-02-10 12:26 GMT

హైదరాబాద్ నగరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'ఫైనాన్షియల్ లిటరసీ వీక్' నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సంచాలకులు శుభ్రతదాస్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.10 నాణెం చెల్లుబాటుపై ప్రజలు ఉన్న అపోహలను తొలగించారు.

కాగా ఇప్పటి వరకూ ఏ షాపులోనైనా రూపాయల నానాన్ని ఇస్తే చెల్లదని వెనక్కి ఇచ్చేవారు. ఇప్పటి వరకూ రూ.10 నాణెం చెల్లుతుందా? లేదా? అన్న అనుమానాలు సామాన్యుల్లో వస్తూనే ఉన్నాయి. అంతే కాదు కొంత మంది ఈ నాణెం చెల్లుతుందని, కొంత మంది చెల్లదని గొడవలు కూడా పడిన సమయం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే రూ.10 నాణెం చెల్లుబాటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అనేక సార్లు క్లారిటీ ఇచ్చింది. నాణెం చెల్లుతుందని తెలిపింది. నాణెం చెల్లదనే అనుమానాలు సామాన్యుల్లో, షాపుల నిర్వాహకుల్లో గట్టిగా నాటుకు పోయింది.

ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సంచాలకులు శుభ్రతదాస్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. రూ.10 నాణెం చెల్లదంటూ ఖచ్చితంగా తేల్చేసారు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఎన్నో సార్లు దీనిపై స్పష్టతనిచ్చింది ఆర్బీఐ.

ఇకపోతే ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నఈ 'ఫైనాన్షియల్ లిటరసీ వీక్'లో భాగంగా ఈ నెల 10 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా నెలకొల్పబడిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై అవగాహన కల్పిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Tags:    

Similar News