Coronavirus: తెలంగాణలో కరోనా కల్లోలం.. 7 మంది మృతి

Coronavirus: రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు * గడిచిన 24గంటల్లో 3,187 కరోనా కేసులు

Update: 2021-04-11 04:33 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఒక్క రోజులో ఏకంగా మూడు వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొదటి వేవ్‌లో కంటే రెండో విడతలో కొవిడ్ వేగంగా వ్యాపిస్తోంది. మొదటివేవ్ పీక్‌లోకి రావడానికి ఆరు నుంచి ఏడు నెలలు పడితే.. సెకండ్ వేవ్ లో ఆ స్థాయి చేరుకోవడానికి 2 నెలలు కూడా పట్టలేదు.. ఇప్పుడు రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన 24గంటల్లో లక్షా 15వేల 311 టెస్టులు చేస్తే వారిలో 3వేల 187 మందికి కొవిడ్ నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 3లక్షల 27వేలకు చేరింది. కరోనా సోకి మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 17వందల 59కి చేరింది. కొవిడ్ నుంచి కోలుకుని 787 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపితే మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3లక్షల 5వేల 335కి చేరింది.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 551 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మేడ్చల్ మల్కాజ్‌గిరి 333, రంగారెడ్డి 271, సంగారెడ్డి 104, నిజామాబాద్ 251, నిర్మల్ 154, కామారెడ్డి 113, కరీంనగర్ 103, జగిత్యాల 134 మందికి కొవిడ్ సోకినట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 

Tags:    

Similar News