Ration Distribution: రేషన్ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ration Distribution: అయితే ఈ నెల కొన్ని కార‌ణాల‌తో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభ‌మ‌య్యింది

Update: 2021-05-17 04:49 GMT
రేషన్ షాప్ (ఫైల్ ఇమేజ్)

Ration Distribution: రేషన్ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చౌకడిపోల్లో రేషన్‌ బియ్యం పంపిణీ ఈ నెల 20 వరకు కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభ‌మై 15వ తేదీవ‌ర‌కు బియ్యం పంపిణీ కొన‌సాగుతుంది. అయితే ఈ నెల కొన్ని కార‌ణాల‌తో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభ‌మ‌య్యింది. దీంతో ల‌బ్ధిదారుల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్ర‌భుత్వం అనుమతించింది.

Tags:    

Similar News