Hyderabad: హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం...నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
Hyderabad: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, జీడిమెట్లలో వర్షం
Hyderabad: హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం...నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు సూర్య ప్రతాపానికి వేడెక్కిన వాతావరణం.. సాయంత్రానికి చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, జీడిమెట్లలో వాన దంచి కొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి.. జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై రోడ్డుపై విరిగిపడిన చెట్లను క్లియర్ చేస్తున్నారు..