Rahul Gandhi: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సామాన్యులతో కలిసి బిర్యానీ రుచిచూసిన రాహుల్
Rahul Gandhi: అశోక్ నగర్‌లో టీ తాగుతూ యువతతో ముచ్చట్లు
Rahul Gandhi: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సామాన్యులతో కలిసి బిర్యానీ రుచిచూసిన రాహుల్
Rahul Gandhi: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అవుతున్నారు. హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న హోటల్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న సామాన్యులతో కలిసి హైదరాబాద్ బిర్యానీ రుచి చూశారు. బవార్చికి వచ్చిన రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీ పడ్డారు. అశోక్ నగర్‌లో వివిధ పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువతతో మాట్లాడారు. వారితో టీ తాగుతూ సమస్యలు తెలుసుకున్నారు.
టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్ష వాయిదా వంటి అంశాలను నిరుద్యో్గులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో యువకుల ఆకాంక్షలు నెరవేరలేదని రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలోకి రాగానే సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. యువత, విద్యార్థులు అధైర్య పడొద్దని సూచించారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన జాబ్ క్యాలెండర్‌ను వివరించారు.