Raghunandan Rao: సిద్ధిపేట ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ ఆభ్యర్థి రఘునందన్ రావు

Raghunandan Rao: కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట్ రమణ రెడ్డి, చికోటి ప్రవీణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

Update: 2024-04-06 02:19 GMT

Raghunandan Rao: సిద్ధిపేట ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ ఆభ్యర్థి రఘునందన్ రావు

Raghunandan Rao: మెదక్ లోక్ సభకు పోటీచేస్తున్న బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు పదునైన మాటలతో ఓటర్లను ఆలోచింపజేసే విధంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిద్దిపేట శరబేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘు నందన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట్ రమణ రెడ్డి, చికోటి ప్రవీణ్ తో కలిసి ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెంకట్రాం రెడ్డి గతంలో కలెక్టర్‌గా పనిచేస్తూ...లక్ష రూపాయ జీతంతో వెయ్యి కోట్ల రూపాయలు విలుచేసే భూముల్ని ఎలా కొన్నాడని ప్రశ్నించారు. 2021 లో ఎమ్మెల్సీగా ఎన్నికై సిద్దిపేటకు ఎందుకు రాలేదని నిలదీశారు. తెలంగాణలో గత ప్రభుత్వంలో పోన్ ట్యాపింగ్ లో బార్య భర్తల మధ్య పోన్ లు సంభాషణలు విన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పప్పు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ఈ జన్మలోనేకాదు, కలలో కూడా కాలేడని రఘునందన్ రావు ఎద్దేవాచేశారు.

Tags:    

Similar News