జల దీక్షకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతల అరెస్ట్...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున టీకాంగ్రెస్ నేతలు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలనే డిమాండ్‌తో జలదీక్షను చేపట్టారు.

Update: 2020-06-02 09:55 GMT
Revanth Reddy (file photo)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున టీకాంగ్రెస్ నేతలు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలనే డిమాండ్‌తో జలదీక్షను చేపట్టారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడి వారిని అక్కడే నిర్బంధించారు. ఈ నేపథ్యంలోనే మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు కొడంగల్‌లో హౌస్ అరెస్ట్ చేసి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అదే విధంగా నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి ఇంటి వద్ద జలదీక్షకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని ఘర్షణ నెలకొంది. ఆయన బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీంతో నాగం మాట్లాడుతూ పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరితే కాంగ్రెస్‌ నేతలను ప్రభుత్వం హౌస్‌ అరెస్ట్‌ చేయడం సబబు కాదని అన్నారు.

అంతే కాక కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ‌కుమార్‌ ను కూడా పోలీసులు నెట్టెంపాడుకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డిని కూడా పోలీసులు జలదీక్షకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేసారు. వారితో పాటుగానే సంపత్ కుమార్‌ ని గద్వాల జిల్లా శాంతినగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. చింతపల్లిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఎంపీ కోమటిరెడ్డి, జానారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా వీరు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వారిని అరెస్టు చేశారు.

Tags:    

Similar News