జూలై 2న ఖమ్మం సభలో పార్టీ కండువా కప్పుకోనున్న పొంగులేటి, జూపల్లి

Rahul Gandhi: భేటీ అనంతరం పార్టీలో చేరబోయేవారి లిస్ట్ విడుదల

Update: 2023-06-26 11:34 GMT

జూలై 2న ఖమ్మం సభలో పార్టీ కండువా కప్పుకోనున్న పొంగులేటి, జూపల్లి

Rahul Gandhi: రాహుల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పార్టీలో చేరబోయేవారి పేర్లతో లిస్ట్ విడుదల చేశారు. 35 మంది నేతల పేర్లతో పాటు వారి ఆధార్ నెంబర్లతో జాబితాను విడుదల చేశారు. జాబితాలో మొదటి పేరు జూపల్లి కృష్ణారావు ఉండగా, లిస్ట్ లో 15వ ప్లేస్ లో పొంగులేటి పేరు ఉంది. జూలై 2న ఖమ్మంలో రాహుల్ ఖమ్మం బహిరంగ సభలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకోనున్న పొంగులేటి, జూపల్లి

రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ లో చేరికలతో పాటు తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరుకావాలని రాహుల్ ను పొంగులేటి, జూపల్లి ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు వెనక్కి రావడం ఆనందంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతోందన్నారు రాహుల్.

ఫోటో సెషన్ అనంతరం రాహుల్ తో కలిసి ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లిన పొంగులేటి

Tags:    

Similar News