మునుగోడుపై దూకుడు పెంచిన పార్టీలు
Munugodu: బీజేపీ సభకు ఒక్కరోజు ముందు బలప్రదర్శనకు టీఆర్ఎస్ స్కెచ్
మునుగోడుపై దూకుడు పెంచిన పార్టీలు
Munugodu: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి. బీజేపీ సభకు ఒక్కరోజు ముందు బలప్రదర్శనకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. వరుస సభలతో మునుగోడు హోరెత్తనుంది. రెండు రోజుల వ్యవధిలోనే టీఆర్ఎస్, బీజేపీ భారీ సభలు నిర్వహించనుంది. రేపు మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. భారీగా జనాన్ని సమీకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎల్లుండి మునుగోడులో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. మరోపక్క సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ.