అనుమతి రాకపోతే కోర్టుకు వెళ్తా‌: కోమటిరెడ్డి

ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం సాధన కోసం 'రైతుసాధన యాత్ర' పేరుతో పాదయాత్రకు సిద్ధమైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. పోలీసు బందోబస్తు ఇవ్వలేమని సమాచారం ఇచ్చారు.

Update: 2019-08-26 03:30 GMT

ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం సాధన కోసం 'రైతుసాధన యాత్ర' పేరుతో పాదయాత్రకు సిద్ధమైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. పోలీసు బందోబస్తు ఇవ్వలేమని సమాచారం ఇచ్చారు. నేషనల్ హైవేపై ట్రాఫిక్‌తో పాటూ అంబులెన్స్‌లు, అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఉంటారని గుర్తు చేశారు. పాదయాత్రతో ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే అనుమతి నిరాకరించినప్పటికి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఆరునూరైనా యాత్ర కోనసాగిస్తానని స్పష్టం చేశారు. తనకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం, నోటీసులు అందలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆరోపించారు. అనుమతి రాకపోతే కోర్టును ఆశ్రయించైనా పాదయాత్ర చేపడతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. 

Tags:    

Similar News