Shilpa Chowdary: శిల్పా చౌదరి ఇంట్లో పోలీసుల తనిఖీలు

Shilpa Chowdary: ఇంటికి తీసుకెళ్లి లాకర్లు తెరిపించిన అధికారులు

Update: 2021-12-04 10:18 GMT

శిల్ప చౌదరి (ఫైల్ ఇమేజ్)

Shilpa Chowdary: చిట్ ఫండ్ మోసం కేసులో అరెస్టయి పోలీస్ కస్టడీలో ఉన్న శిల్పా చౌదరి నోట కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను ఆమె ఇంటికి తీసుకెళ్లి లాకర్లు తెరిపించిన పోలీసులు అందులోంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తానెవరినీ మోసం చేయలేదని, బ్లాక్ మనీని వైట్ మనీ చేయమని కొందరు తనకు డబ్బులిచ్చారని శిల్పా చౌదరి చెప్పింది.. తనకు కొందరు డబ్బు అప్పుగా ఇచ్చారని ఆ డబ్బుని సినిమాహాళ్ళు, ఆస్పత్రుల్లో పెట్టుబడులు పెట్టినట్లు శిల్పా చౌదరిచెప్పింది. తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వలేదని అందుకే తాను చెల్లించాల్సిన వారికి సకాలంలో ఇవ్వలేకపోయానని శిల్పాచౌదరి చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News