కోదండరాం అరెస్ట్!

Update: 2019-08-14 08:39 GMT

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతులిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేందుకు నల్లమల వెళ్లిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను పోలీసులు అడ్డుకున్నారు. వెల్దండలో రోడ్డుపై గంటన్నరకు పైగా కార్లోనే కోదండరాం కూర్చున్నారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటోందని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 19 ప్రకారం తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ తమకు ఉందన్నారు. పోలీసు చర్యలను నిరసిస్తూ జనసమితీ నేతలు రోడ్డపై ధర్నాకు దిగారు. కోదండరాం సహా పలువురిని పోలీసులు అరెస్ చేశారు.  

Tags:    

Similar News