Narendra Modi: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రాబోతోంది

Narendra Modi: సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ కోసం పనిచేస్తున్నాం

Update: 2022-07-03 14:30 GMT

Narendra Modi: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రాబోతోంది

Narendra Modi: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు భాజపాపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు.

''సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చేస్తాం. 8 ఏళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం. దళితులు, ఆదీవాసీల ఆకాంక్షలను భాజపా నెరవేర్చింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచాం. కరోనా కష్టకాలంలో ఇక్కడున్న ప్రతి కుటుంబానికి అండగా ఉన్నాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మంచి ఫలితాలు వచ్చాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారు. తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఆశీర్వదించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ అందరికీ గర్వకారణం '' అని మోదీ అన్నారు.

తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధర పెంచాం. రామగుండం ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించాం. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోంది. భాగ్యనగరంలో అనేక పై వంతెనలు నిర్మించాం. హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నాం.మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. తెలంగాణలో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం'' అని మోదీ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News