PM Modi: తెలంగాణలో బీజేపీ హవా నడుస్తోంది.. ఎస్సీ వర్గీకరణకు బీజేపీకి కట్టుబడి ఉంది..
PM Modi: కామారెడ్డిలో ప్రధాని మోడీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు.
PM Modi: తెలంగాణలో బీజేపీ హవా నడుస్తోంది.. ఎస్సీ వర్గీకరణకు బీజేపీకి కట్టుబడి ఉంది..
PM Modi: కామారెడ్డిలో ప్రధాని మోడీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు నరకం చూశారని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ హవా నడుస్తోందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను..బీజేపీ నెరవేరుస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
తెలంగాణలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ప్రధాని మోడీ. ఎస్సీ వర్గీకరణకు బీజేపీకి కట్టుబడి ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి.. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామి చెప్పారు. కోర్టుల్లోనూ పోరాడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నిన్న ఈ అంశాలపై అధికారులతో చర్చించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.