Tandur: దారుణం.. ఐదు నెలల చిన్నారి ప్రాణాలను మింగేసిన పెంపుడు కుక్క
Tandur: ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిపై దాడిచేసిన శునకం
Tandur: దారుణం.. ఐదు నెలల చిన్నారి ప్రాణాలను మింగేసిన పెంపుడు కుక్క
Tandur: పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయితీలో నాగభూషణం అనే వ్యక్తికి చెందిన పాలిషింగ్ యూనిట్‌లో పనిచేస్తున్నారు. అయితే ఇంట్లో ఉన్న లావణ్య పసికందును ఇంట్లో ఉంచి కిరాణా షాప్‌కు వెళ్లింది. ఇంతలో అక్కడే ఉన్న నాగభూషణానికి చెందిన పెంపుడు కుక్క ఇంట్లోకి చొరబడి ఐదు నెలల పసికందును అతి క్రూరత్వంగా కొరికి పీక్కు తిన్నది.
దీంతో తీవ్రగాయాలపాలైన చిన్నారి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించేలోపే ఆ ఐదు నెలల చిన్నారి మృతి చెందాడు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కుక్కను కొట్టి చంపేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. అయితే పెంపుడు కుక్కలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. వీధి, పెంపుడు కుక్కలు చిన్నారులపై దాడి చేస్తున్నా ఏ మాత్రం పట్టనట్లే ఉన్నారని స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు.