ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి: పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి తెలిపారు.

Update: 2025-12-09 06:55 GMT

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం.. సర్పంచ్ అభ్యర్థులు, యువత, గ్రామస్తులతో భేటీ నిర్వహించి.. పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు.. పోలీస్‌ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు స్పష్టం చేశారు.

పోలింగ్‌ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తొమ్మిది గ్రామాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని.. ఎలాంటి ఆందోళనలకు తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలు, భయాలకు లోనవకుండా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు డీసీపీ భూక్యా రాంరెడ్డి.

Tags:    

Similar News