పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు అరెస్ట్

Patancheruvu: మధుసూదన్‌రెడ్డిని పటాన్‌చెరు పీఎస్‌కు తరలింపు

Jyothi
Published on: 15 March 2024 10:06 AM IST
Patancheruvu MLA Gudem Mahipal Reddy Brother Arrested
X

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు అరెస్ట్

Patancheruvu: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా సంతోష్ సాండ్ అయ్ గ్రానైట్స్ నడుపుతున్నారన్న కారణంతో మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు క్రషర్లు సీజ్ చేశారు. మధుసూదన్ రెడ్డి అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాన్ చెరు పోలీస్ స్టేషన్ చెరుకున్నారు.

Jyothi

Jyothi

Next Story