Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు ప్రారంభించింది.

Update: 2025-08-26 15:10 GMT

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు ప్రారంభించింది.

ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలపై సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబర్ 2న తుది ఓటర్ల జాబితా అందుబాటులోకి

వార్డుల వారీగా ఫైనల్ ఓటర్ల లిస్టును సెప్టెంబర్ 2వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో ఉంచనున్నారు. అంతకుముందు ఆగస్టు 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో లిస్టు ప్రదర్శించనున్నారు. ఆగస్టు 29న జిల్లా ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం కూడా జరుగుతుంది.

ఆగస్టు 28 నుంచి 30 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఈ నెల 28 నుంచి 30 వరకు ఓటర్ల తుది జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 30వ తేదీన మండల స్థాయిలో ఎంపీడీవోలు, రాజకీయ నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 2న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

మొత్తం మీద, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైందని, రాబోయే రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌పై కూడా స్పష్టత రానుందని తెలుస్తోంది.

Tags:    

Similar News