Karimnagar: ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్..
Karimnagar: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయ్యింది.
Karimnagar: ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్..
Karimnagar: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయ్యింది. ఎలుగుబంటికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు అటవీశాఖ సిబ్బంది. చెట్టు నుంచి దిగి పంటపొలాల్లోకి ఎలుగుబంటి పరుగులు తీసింది. దీంతో అటవీశాఖ సిబ్బంది పరుగులు పెట్టడంతో మత్తు ఇంజెక్షన్ అదుపుచేశారు. చెట్టు నుంచి ఎలుగుబంటిని దింపించే ప్రయత్నంలో భాగంగా అది పరుగులు తీసింది. దీంతో అధికారులు కూడా దాని వెనకాలే పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలు గుమిగూడడంతో ఆందోళనకు గురైన ఆ ఎలుగుబంటి రోడ్ క్రాస్ చేసి సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. వెంటనే అటవీశాఖ సిబ్బంది మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు.