ఆన్ లైన్ మ్యారేజ్ చేసిన కరోనా

Update: 2020-03-16 11:21 GMT

అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లికి కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. దీంతో వధూవరులు ఆన్‌లైన్‌బంధంతో ఒక్కటయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలకి చెందిన యువతికి సౌదీలో ఉద్యోగం చేస్తున్న యువకుడితో పెళ్లి జరగాల్సి ఉంది.

కరోనా వైరస్‌ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వరుడు స్వదేశానికి చేరుకోలేకపోయాడు. దీంతో మతపెద్దలు ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం ఆన్‌లైన్‌లో వివాహం జరిపించాలని ఇరుపెద్దలు నిర్ణయించారు. దీంతో యువతితో పాటు సౌదీలో ఉంటోన్న యువకుడితో ఆన్‌లైన్‌లో శుభకార్యం పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లో పెళ్లి తంతుతో ఈ విధంగా ఒక్కింటివారైన జంటను బంధువులు, కుటుంబసభ్యులు ఆశీర్వదించారు.  

Tags:    

Similar News