MLC ELections 2021: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

MLC ELections 2021: రౌండ్ రౌండ్‌కు పెరుగుతున్న ఉత్కంఠ * వరంగల్-ఖమ్మం- నల్లగొండలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి

Update: 2021-03-19 02:28 GMT

ఫైల్ ఫోటో 

MLC ELections 2021: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠను రేపుతున్నాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఏడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు పూర్తయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్ మల్లన్నపై 27 వేల 5వందల 50 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.

మొత్తం ఏడు రౌండ్‌లలో కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఒక లక్షా 10 వేల 8వందల 40 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకు 83 వేల 2 వందల 90 ఓట్లు లభించాయి. కోదండరాంకు 70 వేల 72 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ 27 వేల 588 ఐదో స్థానంలో ఉన్నారు.

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ‌్యర్ధి తీర్మాన్ మల్లన్న మధ్యే హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

ఈ లెక్కన చూస్తే రేపు ఉదయం తర్వాతే పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 51శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. దాంతో పాటు అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగనున్నాయి. 

Tags:    

Similar News