Telangana: ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫామ్‌ ఇదే!

Telangana: దరఖాస్తు నమూనా విడుదల చేయనున్న కేబినెట్‌

Update: 2023-12-27 04:48 GMT

Telangana: ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫామ్‌ ఇదే!

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తు ఫామ్‌ను ఉదయం 11 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్‌లో విడుదల చేయనుంది. ప్రజాపాలన దరఖాస్తు నమూనాను మంత్రి వర్గం విడుదల చేయనుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. రేపటి నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులకు గడువు విధించారు. 4 పేజీల దరఖాస్తులో కాంగ్రెస్‌ గ్యారెంటీల వివరాలు ఉండనున్నాయి. ఇక.. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఆధార్‌, రేషన్‌ కార్డులను లబ్దిదారులు జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు తీసుకున్నాక రసీదు ఇవ్వనున్నారు అధికారులు.

Tags:    

Similar News