డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు ఊరట

Drunk and Drive: హైదరాబాద్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఊరటనిచ్చింది.

Update: 2022-02-22 09:54 GMT

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు ఊరట

Drunk and Drive: హైదరాబాద్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఊరటనిచ్చింది. గతంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి 10,500 జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించేవారు. దాంతో చలాన్లు కట్టలేక చాలామంది తమ వాహనాలను వదిలేసి వెళ్లిపోయేవారు.

అయితే ఇప్పుడు కేవలం 2,100 ఫైన్ కట్టించుకొని కేసును కొట్టివేస్తున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు 28, 938 చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో ఫిబ్రవరి 19 నుండి మార్చి 12 వరకు ఫైన్ కట్టుకునే అవకాశం కల్పించింది కోర్టు. దీంతో నాంపల్లి లోక్‌ అదాలత్‌ దగ్గరికి వాహనదారులు క్యూ కడుతున్నారు. మూడు రోజుల్లో సుమారు 3 వేలమంది కోర్టులో హాజరయ్యారు.

Tags:    

Similar News