యూరేనియం తవ్వకాలు చేసే ఆలోచన లేదు : కేటీఆర్

- నల్లమలలో యూరేనియం తవ్వకాలు జరుపాలనే ఆలోచన విరమించుకోవాలి - శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ - యూరేనియం తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటుంది - అణు ధార్మికత వల్ల భూమి, గాలి, నీరు కలుషితమవుతాయి

Update: 2019-09-22 05:50 GMT

నల్లమలలో యూరేనియం తవ్వకాలు జరుపాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ శాసన మండలిలో మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. నల్లమల అడవుల్లో యూరేనియం కోసం తవ్వకాలు జరపడం పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మానవాళితో పాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని చెప్పారు.యూరేనియం నుంచి వెలువడే అణు ధార్మికత వల్ల పంటలు పండే భూమి... పీల్చే గాలి తాగే నీరు కలుషితమవుతాయని తెలిపారు. నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు జరపడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

Tags:    

Similar News