Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్‌తో ఎలాంటి గ్యాప్ లేదు..
Tamilisai Soundararajan: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో గ్యాప్‌పై స్పందించారు గవర్నర్ తమిళిసై.
Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్‌తో ఎలాంటి గ్యాప్ లేదు
Tamilisai Soundararajan: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో గ్యాప్‌పై స్పందించారు గవర్నర్ తమిళిసై. రాజ్‌భవన్‌కు తెలంగాణ భవన్‌కు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో ఎలాంటి దూరం లేదని..దూరం గురించి తాను పట్టించుకోనని..తన దారి తనదేనని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే..కొట్లాడే ఉద్దేశం తనకు లేదని గవర్నర్ క్లారిటీ నిచ్చారు.
రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ బిల్లుపై తెంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగిందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల లబ్ధికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించానని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై బుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆర్టీసీ బిల్లుపై మాట్లాడారు.