మెట్రోలో హీరో నితిన్..ఎందుకంటే..

Update: 2019-06-21 16:21 GMT

హీరో నితిన్‌ మెట్రోలో ప్రయాణించాడు. రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్‌ ఉండడంతో మెట్రోలో ప్రయాణించినట్లు నితిన్‌ ట్వీట్‌ చేశాడు. మెట్రోలో ప్రయాణించడం మధురానిభూతిని కలిగించిందని నితిన్ ట్వీట్ చేశాడు. నితిన్‌ మెట్రోలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు నితిన్‌తో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. హైదరాబాద్‌లో ఈ రోజు సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పలు చోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాఫిక్‌లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చిక్కుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోవడంతో జనాలు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు.



 


 



  

Tags:    

Similar News