నిలోఫర్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌పై ప్రభుత్వం సీరియస్

-నిలోఫర్‌ ఆసుపత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌పై దుమారం -సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం -సమగ్ర వివరణ ఇవ్వాలన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి -క్లినికల్‌ ట్రయల్స్‌ను ఖండిస్తోన్న బాలల హక్కుల సంఘం -నిబంధనల ప్రకారమే ట్రయల్స్ జరుగుతున్నాయంటోన్న కొందరు వైద్యులు -క్లినికల్‌ ట్రయల్స్‌ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ -ఎవరైనా సరే నిబంధనలకు లోబడే వ్యవహరించాలన్న మంత్రి ఈటల

Update: 2019-09-28 04:25 GMT

నిలోఫర్‌ ఆసుపత్రిలో జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌పై దుమారం చెలరేగింది. అక్కడ జరుగుతున్న ట్రయల్స్‌పై సమగ్ర విచారణకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారానికి నివేదిక సమర్పించాల్సిందిగా వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆదేశించారు. కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఫార్మా కంపెనీలు తయారుచేసిన కొత్త మందులతో హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రిలో పిల్లలపై ప్రయోగం చేస్తున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రి సూపరిండెంట్‌ను సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు.

క్లినికల్‌ ట్రయల్స్‌ను బాలల హక్కుల సంఘం ఖండించింది. నిలోఫర్‌ ఆసుపత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతుండటాన్ని తప్పుబట్టింది. ప్రైవేటు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై కొందరు డాక్టర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని బాలల హక్కుల సంఘం ఆరోపించింది. బాధ్యులైన డాక్టర్లను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రయల్స్‌ నిర్వహిస్తున్న కంపెనీలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని కోరారు.

నిలోఫర్ ఆసుపత్రిలో నిబంధనల ప్రకారమే క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్లు హస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఎతికల్ కమిటీ క్లియరెన్స్ తరువాతే స్టడీ చేస్తామన్నారు. క్లినికల్ ట్రయల్స్ ఏమేమి జరుగుతున్నాయన్న దానిపై డీఎం నివేదిక అడిగారన్నారు. ఇద్దరు డాక్టర్ల మధ్య గొడవ కారణంగానే ఇలాంటి ఆరోపణలు వచ్చాయని చెప్పారు.

 నిలోఫర్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంలో ఎవరూ గందరగోళం చెందొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంలో ఎవరైనా సరే నిబంధనలకు లోబడే వ్యవహరించాలని సూచించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ వ్యవహారంలో ఇప్పటికే డీఎంఈ చర్యలు చేపట్టారని తెలిపారు ఈటల.


Full View

Tags:    

Similar News