ఫోన్ ట్యాపింగ్‌ వల్లే కాంగ్రెస్ ఓడింది: కేసీఆర్‌, కేటీఆర్‌ తలదించుకోవాలి – మహేశ్ కుమార్ గౌడ్‌

ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ. కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలవంచాలంటూ విమర్శలు.

Update: 2025-06-17 10:08 GMT

ఫోన్ ట్యాపింగ్‌ వల్లే కాంగ్రెస్ ఓడింది: కేసీఆర్‌, కేటీఆర్‌ తలదించుకోవాలి – మహేశ్ కుమార్ గౌడ్‌

"టెలిగ్రాఫ్ చట్టాన్ని తుడిచిపెట్టారు"

“టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి నీచమైన దుశ్చర్య. రాజకీయంగా కాంగ్రెస్‌ను నిష్క్రియం చేసేందుకు భయంకర కుట్ర చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్. వారికి సిగ్గుతో తలదించుకోవాల్సిన స్థితి వచ్చింది,” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌ రెడ్డి, నా ఫోన్‌లను ట్యాప్ చేశారు

“రివాన్స్ రెడ్డి ఫోన్‌తో పాటు నాదీ కూడా ట్యాప్ చేశారు. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరి తో మాట్లాడుతున్నాం అన్నదాన్ని నిఘాలో ఉంచారు. ఇదే కారణంగా గతంలోనే ఫిర్యాదు చేశాం. ఇప్పుడు వాస్తవాలు బయటపడ్డాయి. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. SIT దర్యాప్తులో 650 మంది నేతల పేర్లు ఉన్నాయని సమాచారం,” అని పేర్కొన్నారు.

అనేక మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం

కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్ వంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు బయటపడిందన్నారు. “ఈ వ్యవహారమంతా చూస్తుంటే, అప్పటి ప్రభుత్వం అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసిందో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రైవసీ అనే ప్రాథమిక హక్కును పటాపంచలు చేశారు. అధికారులే రాజకీయ నాయకులకు తలొగ్గడం చాలా దురదృష్టకరం.”

ఇంటెలిజెన్స్ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు

“ప్రభాకర్ రావును పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉంచిన విధానం దేశ చరిత్రలో ఎక్కడా కనిపించదు. మా మీద నక్సలైట్ల అనుమానం పేరుతో ట్యాపింగ్ చేశారని చెబుతున్నారు. ఇది సిగ్గుచేటు. కేటీఆర్‌ తలదించుకోవాలి.”

“శిక్షలు తప్పవు – ఐఏఎస్, ఐపీఎస్‌లకూ తగిన చర్యలు తీసుకోవాలి”

“మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వారిని శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మరెవ్వరూ చేయకూడదంటే, ఇప్పుడే కఠిన చర్యలు తీసుకోవాలి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఇందులో భాగమైతే వారినీ శిక్షించాలి. సజావుగా విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి,” అని ప్రభుత్వాన్ని కోరారు మహేశ్ కుమార్ గౌడ్.

Tags:    

Similar News